నిరంతరం కార్మిక శ్రేయస్సే CITU ధ్యేయం

దివాన్ చెరువు పంచాయతీ పారిశుధ్య కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షులు బి. వి. ఎన్. పూర్ణిమ రాజు ఆదివారం రాజానగరం మండలం దివాన్ చెరువులో CITU 57వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, CITU నిరంతరం కార్మికుల శ్రేయస్సు కోసమే పోరాడుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను ఐక్యం చేయడమే నేటి ప్రధాన కర్తవ్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్