రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పామర్తి వెంకటేశులుకి రూ. 10,000, కురుమళ్ల సుబ్బాయమ్మకి రూ. 20,227 మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి శుక్రవారం పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి భరోసాగా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.