మొంథా తుఫానుతో నష్టపోయిన పంటల పూర్తి స్థాయి అంచనా నివేదికను సకాలంలో సమర్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం గోకవరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్ట వివరాలను తెలుసుకున్నారు. నష్టాన్ని వేగంగా, పారదర్శకంగా గుర్తించాలని సూచించారు.