కోరుకొండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ అంకాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద జరగనున్న అన్నసమారాధన కార్యక్రమానికి బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ విరాళాన్ని రామసేన సభ్యులు అందజేశారు.