ఏలూరు పార్లమెంట్ జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ అబ్సర్వర్ గా నియమితులైన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణను ఆదివారం గాదరాడలో ఏలూరు పార్లమెంట్ పరిధి నాయకులు కలిశారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలో చేపట్టనున్న జనసేన పార్టీ నిర్మాణానికి సంబంధించి పలు విషయాలపై చర్చించారు. రాబోయే షెడ్యూల్ కు సమాయత్తం కావాలని, పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకునే వారికి తగిన ప్రొఫైల్ రెడీ చేసుకునే విధంగా అందరికీ సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే బత్తుల శ్రేణులకు పిలుపునిచ్చారు.