దివాన్ చెరువులో BT రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు, దివాన్ చెరువులోని బీజాపూరి టౌన్షిప్ నందు హైవే రోడ్డు నుండి బీటీ రోడ్డు నిర్మాణానికి కూటమి నాయకులు శనివారం శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా రూ. 65 లక్షల అంచనాలతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్టు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శి, మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్