కడియం ఎస్ఆర్ఓ లక్ష్మీ రూ.2.5 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఏసీబీ డీఎస్పీ కిషోర్ తెలిపారు. తక్కువ విలువతో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల రూ.2,62,00,154 నష్టం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 2025లో 911 డాక్యుమెంట్లు సరైన ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేశారని, ఈ నెల 28, 29 తేదీల్లో 144 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగ్గా, ఇంకా 107 డాక్యుమెంట్లు డెలివరీ చేయలేదని ఆయన చెప్పారు.