గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ నెల 12న రాజానగరంలో రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. కోరుకొండలో బుధవారం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు వెన్నుపోటుకి కేరాఫ్ అడ్రస్ అని, కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలక్షేపం చేస్తుందని ఆరోపించారు.