శ్రీకృష్ణపట్నంలో జనసేన పార్టీలో చేరికలు

రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నంకు చెందిన పలువురు వైసీపీ నాయకులు శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పాలన, నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి ఆకర్షితులై తాము జనసేనలో చేరినట్లు నూతన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిమిడి శ్రీరామ్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్