కోరుకొండ: బావను కత్తితో నరికి చంపిన కేసులో నిందితుడి అరెస్ట్

కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో ఆదివారం జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేశామని సీఐ వై. సత్యకిషోర్ తెలిపారు. బావ వరుస అయిన పిల్లి ఆనందకుమార్ను గాడి రాజ్కమల్ కత్తితో నరికి చంపిన సంఘటన తెలిసిందే. సీతానగరం మండలం ములకల్లంకకు చెందిన రాజమల్ను విచారించగా తనపై చేతబడి చేసి చంపేస్తారన్న భయంతోనే ఆనందకుమార్ను చంపినట్లు వెల్లడించారన్నారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

సంబంధిత పోస్ట్