కోరుకొండ: ఈ నెల 4న రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల పందాలు

కోరుకొండ మండలం గాడాలలో ఈ నెల 4వ తేదీన రాష్ట్రస్థాయి ఎడ్ల బండ్ల పందాలు జరగనున్నాయని రైతు నాయకుడు శనివారపు ధనరాజు తెలిపారు. ఈ మేరకు గాడాల-నిడిగట్ల మార్గంలో 2 కిలోమీటర్ల రోడ్డును సిద్ధం చేశామని, శుక్రవారం సాయంత్రం పందాలకు సంబంధించిన కరపత్రాలను రైతులతో కలిసి ఆవిష్కరించామని ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటిసారిగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్