సీతానగరం మండలం కాటవరంలో గురువారం టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) నూతన విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.