కోరుకొండలో ఆదివారం జిల్లా టీడీపీ అధ్యక్షులు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ టీడీపీ నాయకులను సత్కరించారు. పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేసిందని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.