ప్రతిభ చాటిన విద్యార్థులను సత్కరించిన ఎమ్మెల్యే బత్తుల

రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం దివాన్ చెరువుకు చెందిన పదో తరగతి విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జలగం దిలేఖ్య 592, యర్రంశెట్టి సితార 587, పంచికట్ల తేజస్వి 584 మార్కులు సాధించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్