2027 పుష్కరాల పనులపై అధికారులతో ఎమ్మెల్యే బత్తుల సమీక్ష

రాబోయే పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్ల అభివృద్ధి, పటిష్టత పనులపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ & బి, అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పుష్కరాల గ్రాంట్ కింద నియోజకవర్గానికి రెండు దశల్లో భారీగా నిధులు ప్రతిపాదించినట్లు తెలిపారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్' పథకం కింద రూ. 30 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్