రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ బుధవారం సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించి, నూతనంగా నిర్మిస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, పురోగతిని పర్యవేక్షించి అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచనలు చేశారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు సకాలంలో అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.