మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సూర్యమోహన్

రాజమండ్రిలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యమోహన్ మాట్లాడుతూ, విద్యార్థులు దేశ భవిష్యత్తు అని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో విద్యనభ్యసించి దేశ పురోగతికి పాటుపడాలని సూచించారు. 300 మంది విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 'డ్రగ్స్, గంజాయి వద్దు బ్రో' అనే ప్రకటనలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్