రాజానగరం మండలంలోని దివాన్ చెరువు గ్రామంలో దురదృష్టవశాత్తు బాలుడి మృతి అత్యంత బాధాకరం అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. శనివారం బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి మాట్లాడారు. విషయంపై సీఎం చంద్రబాబు స్పందించి రూ. 5 లక్షల నష్టపరిహారం, ఇంటి పట్టా ఇవ్వాలని ఆదేశించినట్లు చెప్పారు. సంఘటనపై విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.