రాజానగరం: ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి

రాజానగరం మండలం రఘునాధపురం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున కందిరెళ్ళ యలమంచలి అనే రైతుకు చెందిన గేదెపై పులి దాడి చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని, రైతును పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దివాన్ చెరువు, రఘునాథపురం, స్వరూప నగర్, శ్రీరామపురం, శ్రీకృష్ణపట్నం, పోలీస్ క్వార్టర్స్ ప్రాంతాలలో పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్