రాజానగరం: గుంతలో పడి బాలుడు మృతి.. జిల్లా కలెక్టర్ పరామర్శ

రాజానగరం మండలం దివాన్ చెరువులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జల సరఫరా పనుల నిమిత్తం తవ్విన గుంతలో 4 సంవత్సరాల వయసున్న బాలుడు కడమంచి శ్రీను ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వెంటనే ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని శుక్రవారం రాత్రి పరామర్శించారు. ప్రభుత్వం నుండి అందవలసిన సహాయం లభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్