రాజానగరం: ఎమ్మెల్యే సమక్షంలో జనసేన పార్టీలోకి చేరికలు

రాజానగరం మండలంలోని తూర్పు గానుగూడెం గ్రామానికి చెందిన సుమారు 100 మంది వైసీపీ శ్రేణులు గురువారం సాయంత్రం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలోకి చేరినట్టు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్