రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మంగళవారం రూ. 350 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాజానగరం మండలం, సీతారాంపురం గ్రామం నుండి గండేపల్లి వైపు, కోరుకొండ నుండి నాగంపల్లి వైపు రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటన తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గంలో జరగనుంది.