రాజానగరం ఎమ్మెల్యే హామీలు నెరవేర్చాలి: పలివెల వీరబాబు

రాజానగరం నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు శుక్రవారం డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించిన రోడ్ల అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారం, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, రైతులకు మద్దతు ధర, కాలనీల్లో మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు కార్యరూపం దాల్చాలని ఆయన కోరారు. వెంటనే ప్రణాళిక ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్