రాజానగరంలో ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు మేము గొప్పగా జీవించామని ఇప్పుడు పేదరికంలో మగ్గుతున్నామని చెప్పారు. రాజకీయాల వల్ల అప్పులపాలై కిస్తీ కట్టలేదని ఫైనాన్స్ సంస్థ కారును తీసుకెళ్లిపోయారని అన్నారు. ప్రస్తుతం అల్లుడి కారు వాడుతున్నానని వివరించారు. అయినా కార్యకర్తలకు న్యాయం చేస్తానని ప్రజల కోసం ఏదైనా చేసేందుకు సిద్ధమన్నారు.