స్పౌజ్ కేటగిరీ కింద రాజానగరం నియోజకవర్గంలో 666 మందికి కొత్త పెన్షన్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం తెలిపారు. రాజానగరం మండలంలో 256, కోరుకొండ మండలంలో 223, సీతానగరం మండలంలో 187 మందికి రూ. 4 వేల చొప్పున మొత్తంగా రూ. 26. 64 లక్షలు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయా గ్రామాల్లో పెన్షన్ దారులకు నగదు అందజేస్తారన్నారు.