రాజానగరం మండలం పల్ల కడియం విద్యుత్ ఉపకేంద్రం మరమ్మతుల నిమిత్తం ఆగస్టు 1వ తేదీన విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ JBN నటరాజన్ బుధవారం తెలిపారు. ఆరోజు ఉదయం 8 గంటల నుంచి 3 గంటల వరకు రాజానగరం, కానవరం, నందరాడ, మల్లంపూడి విద్యుత్ ఉప కేంద్రాల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని అన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించాలని ఆయన సూచించారు.