రాజానగరం: పాముకాటుకు గురైన మహిళ మృతి

రాజానగరం మండలం తూర్పుగానేగూడెంకు చెందిన 60 ఏళ్ల సిద్దాబత్తుల ధనలక్ష్మి బుధవారం పాముకాటుతో మృతి చెందారు. కూలి పనులు చేసుకునే ఆమె మంగళవారం పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి, రాత్రి బాత్రూంలోకి వెళుతున్న సమయంలో పాము కాటుకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

సంబంధిత పోస్ట్