దారపు రీల్స్‌తో రామ మందిరం!

వెలుగుబందకు చెందిన ఉపాధ్యాయుడు భాస్కట పవన్ కుమార్, పనికిరాని వస్తువులతో అద్భుత కళాఖండాలను సృష్టించవచ్చని నిరూపించారు. శ్రీరామనవమి సందర్భంగా దారపు రీల్స్, వాడేసిన అట్టలతో 'అయోధ్య రామ మందిరం' నమూనాను అందంగా తయారు చేశారు. బుధవారం ఈ నమూనాను చూసిన తోటి ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. 'రీయూస్' నినాదంతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్