రెండోరోజు ఏసీబీ అధికారుల విచారణ

కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారుల విచారణ రెండోరోజు కొనసాగుతోంది. గురువారం రాత్రి డీఎస్పీ కిషోర్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కతేలని రూ.1,82,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రార్ లక్ష్మిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో, గత రెండు రోజులుగా జరిగిన రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్