సీతానగరం మండలం ములకల్లంక గ్రామంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ స్థానిక నాయకులతో కలిసి శనివారం పర్యటించారు. ప్రస్తుతం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే అధికారులు గ్రామ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆదేశించారు.