చంద్రవరం శాఖ గ్రంథాలయంలో గురువారం ప్రముఖ తెలుగు కవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి చాగల్లు మండలం MEO చాగంటి సుభాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యంలో మహాకవిగా శ్రీశ్రీ నిరంతర చైతన్యంతో ఆధునిక పదంలో సాహిత్యాన్ని నడిపించారని, 'మహాప్రస్థానం' ప్రజాదరణ పొందిన రచన అని కొనియాడారు. ఆయన జాతీయ చలనచిత్ర పురస్కారాలు, సాహిత్య అకాడమీ, నంది అవార్డులు అందుకున్నారని తెలిపారు. వేసవి విజ్ఞాన శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులను అభినందించారు.