అర్హులైన ప్రతి రైతుకు పాస్ పుస్తకాలు అందేలా చర్యలు

సీతానగరం మండలం ముగ్గళ్ళ గ్రామంలో బుధవారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా లబ్ధిదారులైన రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు సాగు భూములపై సర్వహక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన ద్వారా అర్హులైన ప్రతి రైతుకు పాస్ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్