రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాలలో దేవస్థానం భూములు కబ్జాకు గురవుతున్నాయని స్వతంత్ర జనతా (రిపబ్లిక్) పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బర్రె ఆనంద్ కుమార్ ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ అధికారుల సహకారంతో కబ్జారాయుళ్లు యదేచ్ఛగా వ్యవహరిస్తున్నారని, హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేవస్థానం భూములను కాపాడుతున్న గ్రామస్తులకు పార్టీ అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.