మునికూడలి ఘాట్ కు.. పుష్కర వైభవం..!

రాబోయే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని సీతానగరం మండలం మునికూడలిలో వెలసిన 'దేవాన్ష్ పుష్కర్ ఘాట్'ను రాష్ట్రంలోనే ఒక 'మోడల్ ఘాట్' గా తీర్చిదిద్దనున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. బుధవారం ఆయన అధికారులతో కలిసి ఘాట్‌ను సందర్శించి, దాని పౌరాణిక, ఆధ్యాత్మిక విశిష్టతను కొనియాడారు. అన్ని హంగులతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్