రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో గురువారం ఓ కొండముచ్చు (లంగూర్) ప్రవేశించి, నలుగురు ఖైదీలపై దాడి చేసి గాయపరిచింది. జైలు సిబ్బంది సహకారంతో అటవీశాఖ అధికారులు కొండముచ్చును బోనులో బంధించి, రెండు రోజుల పర్యవేక్షణ అనంతరం పాపికొండల ప్రాంతంలో వదిలేస్తామని తెలిపారు. గాయపడిన ఖైదీలకు వెంటనే టీకాలు వేయించామని, వారి పరిస్థితి బాగానే ఉందని పోలీసులు వెల్లడించారు.