పెదకొండేపూడిలో మళ్లీ పులి కలకలం: అదే ప్రాంతం.. అదే నడక!

పెదకొండేపూడిలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. గత ఫిబ్రవరిలో బంధించి పోలవరం అడవుల్లో విడిచిపెట్టిన పులి, రెండు నెలల తర్వాత మళ్లీ అదే ప్రాంతానికి చేరుకుంది. గతంలో ఆరు పశువులను హతమార్చిన ఈ పులి, మనుషులపై దాడి చేయకపోవడంతో మేన్ ఈటర్ కాదని అటవీ అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ పాత నడకతోనే గ్రామానికి రావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్