తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ఎటువంటి తప్పు చేయలేదని అమలాపురం పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. శనివారం రాజానగరంలోని దేవస్థానం వద్ద వైసీపీ శ్రేణులతో కలిసి 101 కొబ్బరికాయలు కొట్టి, సీఎం చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు.