రోడ్డు ప్రమాదంలో యువతి స్పాట్ డెడ్

రాజానగరం పరిధిలో శనివారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో కారులో ఉన్న ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి, ఇద్దరు యువకులు గాయపడ్డారు. గైట్ కళాశాల దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్