ద్రాక్షారామలో కనులపండువగా భీమేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు

పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో స్వామి, అమ్మవార్లు విశేష అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎస్సై లక్ష్మణ్ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది పటిష్ఠ బందోబస్తు నిర్వహించడంతో భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్