ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ దోహదం: పెయ్యల రాంబాబు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కు అన్ని రంగాల్లో తోడ్పాటు అందిస్తుందని, హానికరమైన వస్తువుల ధరలు పెరగడం మంచిదేనని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పెయ్యల రాంబాబు అన్నారు. క్రిటికల్ మినరల్స్ కారిడార్, హై-స్పీడ్ రైలు కనెక్టివిటీ, డేటా సెంటర్లకు పన్ను ప్రోత్సాహకాలు, ఎలక్ట్రానిక్స్ తయారీకి ప్రోత్సాహం, పర్యాటక రంగంపై దృష్టి వంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ కు లాభదాయకమని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్ర తదుపరి వృద్ధికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్