రామచంద్రపురం మండలం ద్రాక్షారామలోని పి. వి. ఆర్ హైస్కూల్ లో 1989-90 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం 35 సంవత్సరాల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో అప్పటి విద్యార్థులంతా ఆనాటి మధుర జ్ఞాపకాలను, పాత ముచ్చట్లను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో విదేశాల నుండి సైతం ఆ సమయంలో చదువుకున్న విద్యార్థులు వచ్చి సందడి చేశారు.