ద్రాక్షారామం: చదువుకున్న పాఠశాల కోసం.. సీసీ కెమెరాలు ఏర్పాటు

తాము చదువుకున్న పాఠశాల పట్ల పూర్వ విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 2007 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. తమ మాస్టారు సూచన మేరకు తమ స్నేహ బృందం రూ. 50 వేలతో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పూర్వ విద్యార్థులు చిట్టూరి రాము, రెడ్డి మణికంఠ తెలిపారు.

సంబంధిత పోస్ట్