రామచంద్రపురంలో వరుణుడి పలకరింపు..చల్లబడిన వాతావరణం

రామచంద్రపురంలో శనివారం ఉదయం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజానీకానికి ఈ వాన కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. ఎండల తీవ్రత తగ్గి వాతావరణం పూర్తిగా చల్లబడాలని స్థానికులు కోరుకుంటున్నారు. మరోపక్క ఈ తొలి వర్షపు పలకరింపుతో నియోజకవర్గ పరిధిలోని రైతాంగం ఖరీఫ్ వరి సాగు పనులను ప్రారంభించేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్