అయినవిల్లి మండలంలో ఇటీవల వచ్చిన తుఫాన్ కారణంగా ముక్తేశ్వరం-కోటిపల్లి రేవు పంటుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి, కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లే భక్తులు గత నాలుగు నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, మంగళవారం ప్రయాణికులు రేవు పాటదారులను పంటుల రాకపోకలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.