ప్రకృతి కన్నెర్ర.. కె. గంగవరం మండలంలో కుప్పకూలిన వరిచేలు

కె. గంగవరం మండలంలో మంగళవారం కురిసిన అకాల వర్షం వల్ల కోతకు సిద్ధంగా ఉన్న దాళ్వా వరి పంటలు నేలకొరిగాయి. దీంతో దిగుబడి తగ్గుతుందని, పెట్టుబడి వ్యయం పెరిగి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్