రామచంద్రపురం: జాబ్ మేళాలో 15 మందికి నియామక పత్రాలు

రామచంద్రపురం ఉపాధిభవన్లో గురువారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సంయుక్తంగా 42వ జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో టీవీఎస్ కంపెనీకి ఏడుగురు, వరుణ్ బేవరేజెస్ కు ముగ్గురు, డైకిన్ కంపెనీకి ఐదుగురు చొప్పున మొత్తం 15 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. నిరుద్యోగ నిర్మూలనే లక్ష్యంగా ప్రతి వారం నిర్వహిస్తున్న ఈ మేళా పట్ల అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తూ, మంత్రి సుభాష్, ఫౌండేషన్ అధినేత సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్