రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఒక సంజీవనిలా ఆదుకుంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం నియోజవర్గంలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో అనారోగ్యం పాలైన బాధిత కుటుంబాలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం రూ. 12. 93 లక్షల చెక్కును పంపిణీ చేశారు.