అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వేలంపాలెం గ్రామంలో శుక్రవారం కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. వృద్ధులకు రూ.4000, వికలాంగులకు రూ.6000 పెన్షన్లు మంజూరైన నేపథ్యంలో ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పెయ్యల రాంబాబు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.