తీవ్రమైన ఎండల వేడిమికి రామచంద్రపురం ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. ఎండ తీవ్రత తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే గొడుగు, మంచినీళ్ల బాటిల్ వెంట ఉంచుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.