రామచంద్రపురం పట్టణం పరిధిలోని రత్నంపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. విద్యార్థిని, విద్యార్థులకు మంచి విద్యతో పాటుగా వారికి కావలసిన వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. గురువులు చెప్పిన పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా విని మంచి భవిష్యత్తు పొందాలన్నారు.